Advertisementt

అవికా గోర్ బర్త్ డే స్పెషల్

Wed 30th Jun 2021 01:44 PM
chinnari plelikuturu fame avika,avika gor,tollywood heroine avika,avika gor birthday special  అవికా గోర్ బర్త్ డే స్పెషల్
Avika Gor Birthday Special అవికా గోర్ బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసిన అవికా గోర్ ఆ తర్వాత చిన్న వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. రాజా తరుణ్ తో కలిసి బ్యాక్ టు హిట్స్ కొట్టింది. తర్వాత ఆమె బరువు ఆమెకి శాపంగా మారింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అవికా గోర్.. తన హెల్త్ ఇష్యుస్ వలన బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యింది. బరువు తగ్గిపోయాక అవికా గోర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. వెయిట్ లాస్, గ్లామర్ డోస్ పెరిగాక అవికా గోర్ నాగ చైతన్య థాంక్యూ మూవీ తో పాటుగా.. అది సాయి కుమార్, కళ్యాణ్ దేవ్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. 

అంతేకాకుండా అవికా గోర్ కి మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్టుగా టాక్. అలాగే పర్సనల్ గాను మిలింద్ చాంద్వాని తో ప్రేమలో ఉన్న అవికా గోర్ మిలింద్ ని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. కెరీర్ లో సెటిల్ అయ్యాక పెళ్లి గురించిన న్యూస్ చెబుతా అంది. నేడు అవికా గోర్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుండి అవికకి స్పెషల్ పోస్టర్స్ తో బర్త్ డే విషెస్ అందుతున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకుడిగా కళ్యాణ్ దేవ్ హీరోగా రాబోతున్న మూవీ నుండి అవిక పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదిలారు. 

కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. వరస సినిమాల్తో బిజీ అయిన అవికా రీ ఎంట్రీ తో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా అవికా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ.. నేడు బర్త్ డే జరురుపుకుంటున్న అవికా గోర్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Avika Gor Birthday Special:

Chinnari Plelikuturu fame Avika Gor Birthday Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ