బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ రెస్యూమ్ షూట్ జులై ఫస్ట్ వీక్ నుండి మొదలు కాబోతుంది. ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య ని ఢీ కొట్టబోయేది హీరో శ్రీకాంత్. బాలయ్య అఖండ రోల్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అఘోర గా బాలకృష్ణ పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు విలన్ పాత్రధారి శ్రీకాంత్. ఇక పోస్ట్ కరోనా షూట్ లో అఖండ టీం మొత్తం పాల్గొనబోతుందట.
అఖండ పోస్ట్ కరోనా షూట్ ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట, కడప, చిత్తూరుకి సంబంధించిన చరిత్రాత్మక ప్రాంతాల్లో చిత్రీకరించాలని బోయపాటి ప్లాన్ చేసుకున్నాడట. వచ్చే వారం మొదలు కాబోయే అఖండ షూటింగ్ కోసం అఖండ టీం గండికోట, చిత్తూరు, కథలలో లొకేషన్స్ వేటలో ఉందట. షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్స్ కి వెళ్లేముందే అఖండ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని.. వినాయక చవితి రోజు అఖండ ని రిలీజ్ చేసే ప్లాన్ లో టీం ఉన్నట్లుగా చేస్తుంది.