పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సెకండ్ వేవ్ కి ముందు థియేటర్స్ బాక్సాఫీసుని షేక్ చేసింది. అంచనాలకు మించి కలెక్ట్ చేసిన వకీల్ సాబ్ కి సెకండ్ వేవ్ గనక అడ్డం పడకపోతే.. ఇంకా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టేది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ షూటింగ్స్ తయారైపోయారు. జులై ఫస్ట్ వీక్ నుండి ఏకే రీమేక్ షూట్ లో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో హరి హర వీరమల్లు చెయ్యబోతున్నారు. ఏకే రీమేక్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే పోలీస్ స్టేషన్ సెట్ లో చిత్రీకరించబోతున్నారు.
ఇక హరిహర వీరమల్లు కోసం దర్శకుడు క్రిష్ గోల్కొండ కోట, చార్మినార్ లాంటి భారీ సెట్స్ వేయించాడు. మొఘలాయికాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక తాజాగా ఈ సినిమా కోసం ఆగ్రా కోట తాలూకు సెట్ వేస్తున్నారట. ఇది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. దీని కోసం భారీగా పెడుతున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తుంటే ఆయనకి విలన్ గా గ్లామర్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇక యువరాణిగా బాలీవుడ్ భామ జాక్వలిన్, హరిహరవీరమల్లుకి విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ నటించబోతున్నారు.