Advertisementt

తాప్సి బాలీవుడ్ కెరీర్ టర్న్ అవ్వబోతుంది

Tue 29th Jun 2021 12:47 PM
taapsee pannu,bollywood movies,star opposite,shah rukh khan,raj kumar hirani movie,taapsee pannu - shah rukh khan combo  తాప్సి బాలీవుడ్ కెరీర్ టర్న్ అవ్వబోతుంది
Taapsee Pannu to star opposite Shah Rukh Khan? తాప్సి బాలీవుడ్ కెరీర్ టర్న్ అవ్వబోతుంది
Advertisement
Ads by CJ

తెలుగులో తననెవరూ పాటించుకోకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్న తాప్సి పన్ను అక్కడ కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో దూసుకెళుతుంది. మెస్సేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్, పెరఫార్మెన్సు ప్రాధాన్యమున్న ఫిలిమ్స్ తో.. గ్లామర్ పరంగా రెచ్చిపోతున్న తాప్సి కి పెద్దగా స్టార్ హీరోల సినిమాలు, కమర్షియల్ మూవీస్ లో చేసే అవకాశం వచ్చిన సందర్భం లేదు. అయినా తాప్సి కెరీర్ చాలా స్పీడుగా ఉంది. తాజాగా మిథాలీ రాజ్ బయోపిక్ చేస్తున్న తాప్సి బాలీవుడ్ కెరీర్ టర్న్ అయ్యే ఛాన్స్ రాబోతున్నట్టుగా బాలీవుడ్ మీడియా టాక్. 

షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరాణీ.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అతి త్వ‌ర‌లోనే ఓ సినిమా రాబోతోంద‌ని అనే టాక్ ఉంది. వీరి కాంబో ఫిలిం పై ఎప్పటినుండో ప్రచారం జరుగుతన్నా ఇంతవరకు ఆ సినిమా పై ప్రకటన అయితే రాలేదు. తాజాగా రాజ్ కుమార్ హిరాణీ.. షారుఖ్ కి కథ వినిపించి ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది. ఈ సినిమా కోసమే తాప్సి ని హీరోయిన్ గా తీసుకోవాలని రాజ్ కుమార్ హిరాణీ భావిస్తున్నాడట. మరి అదే గనక నిజమైతే తాప్సి బాలీవుడ్ కెరీర్ మరింత కలర్ ఫుల్ గా మారడం ఖాయం. 

Taapsee Pannu to star opposite Shah Rukh Khan?:

Taapsee Pannu to star opposite Shah Rukh Khan in Raj Kumar HIrani movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ