Advertisementt

అల్లు వారి ఐకాన్.. హీరోయిన్ ఆమేనా

Tue 29th Jun 2021 10:27 AM
allu arjun,icon movie,venu sriram - allu arjun,kiara advani or alia bhatt,allu arjun - kiara advani,allu arjun - alia bhatt combo  అల్లు వారి ఐకాన్.. హీరోయిన్ ఆమేనా
Allu Arjun to be romancing Kiara Advani? అల్లు వారి ఐకాన్.. హీరోయిన్ ఆమేనా
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ పుష్ప రెస్యూమ్ షూట్ కోసం గోవా వెళ్లబోతున్నాడు. సుకుమార్ గోవా లో పుష్ప షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. హీరోయిన్ రష్మిక, అల్లు అర్జున్ తో పాటుగా విలన్ కేరెక్టర్ చేస్తున్న ఫహద్ ఫాసిల్ కూడా గోవా పయనమవుతున్నారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కాంబోలో ఐకాన్ మూవీ చేయబోతున్నాడనే అంటున్నారు. ఈ సినిమాని దిల్ రాజు - గీత ఆర్ట్స్ వారు కలిసి నిర్మించబోతున్నారని, లాక్ డౌన్ టైం లో అల్లు అర్జున్ తో కథా చర్చలు కూడా వేణు శ్రీరామ్ పూర్తి చేసాడని.. అలాగే ఈ సినిమా హీరోయిన్ విషయం కూడా దాదాపుగా ఓ కొలిక్కివచ్చినట్లే అంటున్నారు. 

ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా అల్లు అర్జున్ చెయ్యబోతున్నాడట. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా కియారా కానీ,  అలియా భట్ ని కానీ వేణు శ్రీరామ్ సంప్రదించబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. ఇప్పటికే కియారా అద్వానీ రామ్ చరణ్ - శంకర్ పాన్ ఇండియా  ఫిలిం, ఎన్టీఆర్ - కొరటాల పాన్ ఇండియా ఫిలిం హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది. ఎన్టీఆర్ తో కియారా దాదాపుగా ఖాయమంటున్నారు. మరి కియారా అయితే అల్లు అర్జున్ పక్కన ఫ్రెష్ జోడిగా ఉంటుంది అని, కాదు ఆమెకి డేట్స్ ఖాళీ లేవనుకుంటే.. ఆర్.ఆర్.ఆర్ సీతమ్మ అలియా భట్ ని అయినా అల్లు అర్జున్ కి జోడిగా తేవాలనేది దిల్ రాజు - వేణు శ్రీరామ్ ప్లాన్ గా చెబుతున్నారు. 

Allu Arjun to be romancing Kiara Advani?:

Allu Arjun to be romancing Kiara Advani or Alia Bhatt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ