తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసారు. కానీ ఏపీలో ఇంకా నైట్ కర్ఫ్యూలు నడుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో లెక్కలు మించి కేసులు నమోదు కావడంతో.. అక్కడ నైట్ కర్ఫ్యూలు మరో వారం పొడిగించారు. దానితో తెలంగాణాలో లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్స్ ఓపెన్ చెయ్యలేని పరిస్థితి. ఒక వేళ థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు వస్తారో రారో చెప్పలేని స్థితి. అందుకే చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ దృశ్యం 2, నారప్ప, విరాట పర్వం మూవీ లు ఓటిటి కి అమ్మేస్తున్నారనే టాక్ నడుస్తుండగా.. నితిన్ మ్యాస్ట్రో హాట్ స్టార్ కి అమ్మేశారనే చెబుతున్నారు.
మరి థియేటర్స్ క్లోజ్ అయ్యాయి.. ఆగస్టు ఫస్ట్ వరకు ఆగితే మళ్ళీ సినిమాల సందడి మొదలవుతుంది అనుకుంటే.. ఇప్పుడు చాలామంది ఓటిటికి వెళ్లేలా కనిపిస్తున్నారు. అందులో హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఓటీటీకి ఇచ్చెయ్యొచ్చనే టాక్ మొదలయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాలే ఉన్న ఈ సినిమా ఓటిటిలోకి రావచ్చని ఊహాగానాలు రావడం, నిర్మాతలు ఖండించడము జరిగింది.
మళ్ళీ లేటెస్ట్ గా గీత ఆర్ట్స్ బన్నీ వాష్ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇంకా చక్కబడలేదనే భావిస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. అసలు ఆడియన్స్‌కి థియేటర్ కి వచ్చే మూడ్ ఉందో, లేదో ఇప్పుడే అంచనా వేయలేం. ఓటీటీ ఆఫర్లు బాగా వస్తే.. తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తాం.. అంటూ చెప్పడంతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు ఓటిటిలో వచ్చేస్తాయనే టాక్ మొదలైపోయింది. సో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఓటిటిలో వచ్చేసినా వచ్చెయ్యొచ్చని అంటున్నారు.