ప్రస్తుతం టాలీవుడ్, బాలీవడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న పూజ హెగ్డే తోలి రోజుల్లో బాలీవుడ్ లో నటించింది. కానీ పూజ హెగ్డే కి మొదటగా టాలీవుడ్ కెరీర్ పరంగా నెంబర్ వన్ చైర్ ని ఇచ్చింది. పాన్ ఇండియా హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోను అదరగొట్టేస్తున్న పూజ హెగ్డే తమిళ్ లోకి విజయ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే పూజ హెగ్డే కెరీర్ స్టార్ట్ చేసిందే కోలీవుడ్ నుండి అట. జీవ హీరో గా మూగముడి సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఇప్పుడు పూజ హెగ్డే రేంజ్ 3 నుండి 4 కోట్లు అందుకొంటుంది. ఆమె పారితోషకం అంతగా పెరిగిపోయింది. అప్పట్లో మూగముడి టైం లో పూజ హెగ్డే పారితోషకం ముప్పై లక్షలట. అదే పూజ హెగ్డే తోలి పారితోషకమట. ఆ డబ్బు తో పూజ హెగ్డే కొత్తగా కారు కొనుక్కుందట. తనకు వచ్చిన తోలి సంపాదనతో పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఈ కారు ఇప్పటికి పూజా హెగ్డే దగ్గర భద్రంగా ఉంది.
తొలిసారి తన సంపాదనతో కొన్న ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారుని చూసినప్పుడల్లా పూజ మురిసిపోతుందట. మరి అప్పట్లో ముప్పై లక్షలు అందుకున్న పూజ హేగే.. ఇప్పుడు మూడు కోట్లు అందుకుంటుంది. ఇక తమిళ సినిమా తర్వాత తెలుగులో, ఆ తర్వాత బాలీవుడ్ లో కెరీర్ ని మొదలు పెట్టిందట పూజ హెగ్డే.