Advertisementt

కత్తి మహేష్ హెల్త్ అప్ డేట్

Sun 27th Jun 2021 11:35 AM
kathi mahesh,kathi mahesh health condition,kathi mahesh present health condition,kathi mahesh road accident  కత్తి మహేష్ హెల్త్ అప్ డేట్
Kathi Mahesh Health update కత్తి మహేష్ హెల్త్ అప్ డేట్
Advertisement
Ads by CJ

నిన్న తెల్లవారి ఝామున రోడ్డు ప్రమాదానికి గురైన క్రిటిక్ కత్తి మహేష్.. నెల్లూరు లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి వరకు కత్తి మహేష్ ఆరోగ్యం ఆందోళకరంగానే ఉంది. ఆయన కంటి కి బలమైన దెబ్బలు తగలడంతో కన్ను పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా, బ్రెయిన్ లో చిన్నపాటి గాయాలు కావడంతో కత్తి మహేష్ ఆరోగ్యంపై డాక్టర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసారు. అందులో ఆయన హెల్త్ అప్ డేట్ రాకపోయేసరికి కత్తి మహేష్ ఆరోగ్యం విషమం అంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చేశాయి.  

అయితే తాజాగా కత్తి మహేష్ ఆరోగ్యం స్టేబుల్ గానే ఉంది అని, క‌త్తి మ‌హేష్ కి అయిన గాయాల తీవ్ర‌త దృష్ట్యా ఆయ‌న‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ చేయాల‌ని అనుకున్నారు. అన్ని టెస్ట్ లు చేసాక బ్రెయిన్ ఇంజ్యూరీ పెద్ద‌దేం కాద‌ని డాక్ట‌ర్లు నిర్దారించారు. ఆప‌రేష‌న్ చేసే అవ‌కాశాలు స్వ‌ల్పంగానే ఉన్నాయ‌ని స‌మాచారం. అయితే కత్తి మహేష్ ప్రాణానికి పెద్దగా అపాయం లేదని.. కంటి చికిత్స నిమిత్తం ఆయన్ని చెన్నై కి తరలించబోతున్నట్లుగా తెలుస్తుంది. 

Kathi Mahesh Health update:

Kathi Mahesh Present Health Condition Briefed By Doctors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ