ప్రభాస్ తో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఇదే మాట చెబుతారు. ప్రభాస్ చాలా సింపుల్, ఆయన సూపర్, అందరితో సెట్స్ లో చాలా కలుపుగోలుగా ఉంటారు.. ఇవన్నీ చాలాసార్లే విన్నాం. తాజాగా ప్రభాస్ తో ఆదిపురుష్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ప్రభాస్ ని తెగ పొగిడేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ గురించి స్పెషల్ గా మాట్లడిన ఓం రౌత్ మరోసారి ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉన్న యాక్టర్. అయినా ప్రభాస్ కి ఎలాంటి గర్వం లేదంటున్నారు.
సినిమా సెట్స్ లో అందరితో చాలా నార్మల్ గా ఉంటారని, ప్రతి ఒక్కరిని ట్రీట్ చేసే పద్దతికి అందరూ ఫిదా అవుతారని, ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుండి.. ఇంత సింపుల్ గా ఉండడం అనేది ఎక్కడా చూడలేదని, ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే.. ప్రభాస్ లాంటి స్టార్ ని ఎక్కడా చూడలేదని ఓం రౌత్ తన హీరో ప్రభాస్ ని గురించి చెబుతున్నారు. ప్రభాస్ చాలా అణుకువ కలిగిన హీరో అని, అలాంటి వ్యక్తిత్వం చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది అని ప్రభాస్ లాంటి స్టార్ హీరో తన సినిమాకి దొరకడం తన అదృష్టం అంటూ ఓం రౌత్ తన రాముడు ప్రభాస్ ని మరోసారి పొగడడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.