Advertisementt

US క్లినిక్ దగ్గర రజిని పిక్ వైరల్

Sat 26th Jun 2021 12:27 PM
super star rajinikanth,rajinikanth,us trip,rajini health checkup,rajini pic from us,rajinikanth us pic goes viral  US క్లినిక్ దగ్గర రజిని పిక్ వైరల్
Rajinikanth US Pic goes viral US క్లినిక్ దగ్గర రజిని పిక్ వైరల్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ కేంద్రం దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని మరీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం రజినీకాంత్ అమెరికా వెళ్లాల్సి ఉండగా ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వలన అమెరికా ప్రయాణం పోస్ట్ పోన్ అయ్యింది. అయితే సూపర్ స్టార్ కేంద్రానికి స్పెషల్ పర్మిషన్ కోసం అడగ్గా.. అమెరికా వెళ్లేందుకు రజినీకి పర్మిషన్ ఇవ్వడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ 14 మంది పట్టె స్పెషల్ ఫ్లైట్ లో ఆయన కూతురు, అల్లుడు తో కలిసి అమెరికా వెళ్లారు. రజిని ఆరోగ్యపై ఆయన అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. రెగ్యులర్ చెకప్ అయితే.. అంత అర్జెంట్ గా రజిని అమెరికా ఎందుకు వెళ్లారో అని. 

అయితే తాజాగా రజినీకాంత్ అమెరికా లో హెల్త్ చెకప్ కి వెళ్లిన విషయాన్నీ ఓ పిక్ ద్వారా తెలియజేసారు. రజినీకాంత్ ఆయన కూతురు అమెరికా లోని Mayo క్లినిక్ నుండి బయటికి వస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజిని ఆరోగ్యంగా ఉన్నారనే విషయం ఆ పిక్ చూస్తే తెలిసిపోతుంది. అంటే ఆయన నిజంగానే రెగ్యులర్ చెకప్ కె యుఎస్ ఫ్లైట్ ఎక్కారనడానికి ఈ పిక్ నిదర్శనం అంటున్నారు. ఇక రజినీకాంత్ అమెరికా వెళ్లేందుకే తాను నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ ని హడావిడిగా పూర్తి చేసి డబ్బింగ్ కూడా చెప్పేసారు. అయితే రజిని ఇకమీదట సినిమాల్లో నటించారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. 

Rajinikanth US Pic goes viral :

Super star Rajini pic from US goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ