Advertisementt

ఇండియా కరోనా అప్ డేట్

Sat 26th Jun 2021 10:04 AM
india corona,india,covid 19,corona virus cases,india covid 19,delta plus,corona vaccine  ఇండియా కరోనా అప్ డేట్
India Corona update ఇండియా కరోనా అప్ డేట్
Advertisement
Ads by CJ

ఇండియా లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నాలుగు రోజులుగా 50,000 కేసుల పైచిలుకు నమోదు అవుతుంటే.. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. ముందు రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు.. తాజాగా 6లక్షల దిగువకు చేరాయి. క్రియాశీల రేటు 1.97 శాతానికి తగ్గగా రికవరీరేటు 96.72 శాతానికి పెరిగింది. నిన్న 64,818 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలా ఉండగా సెకండ్ వేవ్ వైరస్‌ విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

India Corona update:

India Covid 19 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ