గురువారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ అనసూయ ని యూట్యూబ్ యాంకర్ శివ.. ఆది స్కిట్ అయ్యాక అనసూయ గారు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగలనుకుంటున్నాను.. అనగానే మీ ప్రశ్నలు ఇంకా అవ్వలేదా అంటూ అనసూయ జబర్దస్త్ స్టేజ్ మీద అడగగా.. యాంకర్ శివ మీరు చిన్న చిన్న బట్టలు వేసుకుంటారని.. మీ కామెంట్స్ బాక్స్ లో కామెంట్స్ ఉంటాయి.. దీనికి మీ స్పందన ఏమిటి అని అడగగా.. అవునండి వాళ్ళకి తెలియక అలా అడుగుతారు.. కానీ మీరు అన్ని తెలిసే ఎలా అడుగుతారంటూ.. అయినా అది నా పర్సనల్ అనగానే మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో ఉండాలి ఇలాంటివి అని శివ అనగానే అనసూయ రుసరుస లాడుతూ ఆది ని ఇలాంటి వారిని షో కి ఎందుకు తీసుకొస్తారో అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయింది.
ఇక రోజా దెబ్బలు తినడానికే ఇలాంటి ప్రశ్న అడిగావు అని శివ ని అనగా.. అనసూయ స్టేజ్ దిగి ఇవన్నీ మీకు తెలియకూండానే జరుగుతున్నాయా అంటూ కోపం తెచ్చుకోగా.. ఆది మాత్రం తెలిస్తే ముందే ఆపేవాడిని అని అనగా.. దానికి శివ అందరూ అడుగుతున్న ప్రశ్నలే నేను అడిగాను.. జోక్ గా అంటే... దానికి అనసూయ ఇది జోక్ ఎలా అవుతుంది అండి అనగానే శివ అనసూయ కి సారి చెప్పేసాడు. కానీ అనసూయ ని ఆది, అభి లాంటి వారు బ్రతిమిలాడగా.. మళ్ళీ స్టేజ్ ఎక్కిన అనసూయ పేస్ మాడ్చుకుని ఉంది.
ఇక జెడ్జెస్ రోజా, మనో అలా స్టన్ అవ్వగా.. రోజగారు అనసూయకి శివ సారి చెప్పాడు ఆవిడా కూల్ అయ్యింది అని ఆది అనగా.. అవును రోజా గారు ఇదంతా నమ్మేశారా అని అనసూయ అంటే నేను నమ్మలేదు అంటూ రోజా చెప్పడంతో స్టేజ్ మీద అనసూయ కూల్ గా ఇలాంటి ప్రశ్నలు విని విని అలవాటైపోయింది.. అంటూ హాయిగా నవ్వేసింది. అంటే ప్రోమో లో చూపించినట్టుగా అక్కడ షో లో ఏం జరగలేదు.