మా ఎలక్షన్స్ హీట్ టాలీవుడ్ లో అంతకంతకు పెరిగిపోతుంది. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవిత - హేమ లు పోటీ పడుతున్న మా ఎన్నికల్లో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ కి - మంచు విష్ణు ప్యానల్ కె గట్టి పోటీ ఉండబోతుంది. మంచు విష్ణు ఎన్నికల్లో నిలబడతానని చెప్పకముందే ఇండస్ట్రీ పెద్దలని కలిసి బలం కూడగట్టుకుంటే.. ప్రకాష్ రాజ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. ముందు నుండే ఆయన మా ఎన్నికల విషయంలో స్పష్టమైన హామీలను సిద్ధం చేసుకున్నారు.
మెగా కాంపౌండ్ అండ ఉన్నా లేకపోయినా గెలుపు ఖాయమంటున్న ప్రకాష్ రాజ్ తన ప్యానల్ లోకి గట్టి, పేరున్న క్యాండిడేట్స్ ని తీసుకుని పేరు ప్రకటన ఇచ్చేసారు. అలాగే ప్రెస్ మీట్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. మంచు విష్ణు ఇప్పటివరకు కామ్ గా ఉన్నాడు. తన ప్యానల్ ని ఇంకా ప్రకటించలేదు. అటు జీవిత, హేమ నామమాత్రంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో దూకుసుకుపోతున్నారు. తన హామీలను పక్కాగా అమలు చేస్తా అంటూ బల్ల గుద్ది చెబుతున్నారు. మా కు ఇంతవరకు సొంత భవనం లేదని, మా కు సొంత భవనం కట్టేందుకు కృషి చేస్తా అని, అలాగే సినీకార్మికులకి సహాయం చేసేందుకు టాలీవుడ్ లో అనేకమంది నటులు ఉన్నారని, వారిని ఏకతాటిమీదకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారు.