తారక్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నారు. దానితో తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుని, రాజమౌళి తో కలిసి ఆర్.ఆర్.ఆర్ హిట్టుని పంచుకున్నా.. ఈ సినిమాతో తారక్ రేంజ్ పెరగడం ఖాయం. కొమరం భీం గా కొత్త లుక్ లో కనిపిస్తున్న తారక్.. ఈ సినిమా కోసం 30 కోట్లు అందుకోబోతున్నాడట. దానయ్య తారక్ కి ఇప్పటికే సగంపైనే పారితోషకం సెటిల్ చేసేసాడట. మిగిలింది బిజినెస్ అవ్వగానే సెటిల్ చేస్తా అని చెప్పడమే కాదు.. అవకాశం ఉంటె లాభల్లో కూడా తారక్ కి వాటా రావచ్చట. ఇక తారక్ కి మాత్రమే కాదు.. అటు రామ్ చరణ్ కి కూడా సేమ్ టు సేమ్ అంటున్నారు.
ఆదాల ఉంటే.. తారక్ నెక్స్ట్ మూవీ కొరటాల తో చెయ్యబోయే మరో పాన్ ఇండియా మూవీకి కూడా తారక్ వాటా రూపేణా అందుకోబోతున్నాడట. ఎందుకంటే కళ్యాణ్ రామ్ వున్నాడు కాబట్టి. ఇక ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం కి కూడా తారక్ 40 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడనే న్యూస్ వినిపిస్తుంది. వరస పాన్ ఇండియా ఫిలిమ్స్ తో తారక్ రేంజ్ అమాంతం పెరిగింది అని.. ఒకే ఒక్క ఆర్.ఆర్.ఆర్ హిట్ అయ్యింది అంటే తారక్ ని అందుకోవడం కష్టమంటున్నారు. మరి ప్రస్తుతం తారక్ పారితోషకం పై టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చలు కూడా జరుగుతున్నాయి.