ఏపీ గవర్నమెంట్ ఏప్రిల్ నెలాఖరు, సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటినుండి ఏపీలో ఇంటర్, 10th పరిక్షల నిర్వహణకు ఉత్సాహం చూపుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా.. జూన్ లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ సెకండ్ వేవ్ కంట్రోల్ కాకపోవడంతో ఎగ్జామ్స్ ని వాయిదా వేస్తున్నారు తప్ప పరీక్షలను రద్దు చెయ్యకుండా విద్యార్థులకి టెంక్షన్ తెప్పిస్తున్నారు. మరోపక్క ప్రతి పక్ష నాయకుడు నారా లోకేష్ ఏపీ లో 10th, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చెయ్యాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.
కానీ జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తాము.. అది విద్యార్థుల భవిష్యత్తు కోసమే అంటున్నారు. తాజాగా ఏపీ 10th, ఇంటర్ పరీక్షల పంచాయితీ సుప్రీం కోర్టుకి చేరింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ ఎగ్జామ్స్ ని రద్దు చేశారు. కానీ మీరు మాత్రం నిర్వహిస్తామని చెబుతున్నారు.. ఒకవేళ మీరు పరీక్షలు కండక్ట్ చేసాక ఏ విద్యార్థి అయినా.. కరొనతో కన్ను మూస్తే కోటి పరిహారం ఇవ్వాల్సిందే అని, ఇక మిగతా రాష్ట్రాలకు జులై 31 లోపు ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటించాలని తీర్పు చెప్పడంతో.. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దారికి వచ్చింది.
ఏపీ ప్రభుత్వం పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో, రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడింది. ఇంటర్, 10th ఎగ్జామ్స్ రద్దు చేస్తూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీలో 10th, ఇంటర్ పరీక్షలు రద్దు చేశామని, సుప్రీంకోర్టు సూచన మేరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే జులై 31 లోపు ఫలితాలు ఇవ్వడం అసాధ్యం అని, ఇంటర్ పరీక్షల ఫలితాలపై హైపవర్ కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రెస్ మీట్ లో ఆదిమూలపు చెప్పారు.