శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలను పరిశీలిస్తే అందులో ప్రేమకథలు ఎక్కువగా ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా.. రీసెంట్ మూవీ లవ్ స్టోరీ.. మధ్యలో రానా ని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి లీడర్ అనే పొలిటికల నేపథ్యం ఉన్న కథతో సినిమా చేసినా.. శేఖర్ కమ్ముల్ తన ప్రేమ కథ జోనర్ ని మాత్రం విడవలేదు. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ తెరకెక్కించబోయే ధనుష్ మూవీపై అందరికి మంచి ఆసక్తి ఉంది. మాస్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల్ మాస్ మూవీ చేస్తారా? లేదంటే ప్రేమ కథ చిత్రంతో మూడు భాషల్లోకి వెళతారా? అనే డౌట్ అందరిలో ఉంది.
అయితే తాజాగా శేఖర్ కమ్ముల, ధనుష్ తో చెయ్యబోయే చిత్రాన్ని పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరక్కేకిన్చబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళనాడు పాలిటిక్స్ తో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా శేఖర్ కమ్ముల కథను రెడీ చేసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పొలిటికల్ టచ్ తో .. శేఖర్ కమ్ముల లవ్ మార్కుతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ సినిమాలో సాయి పల్లవి ధనుష్ తో రొమాన్స్ చెయ్యబోతున్నట్టుగా విపరీతంగా ప్రచారం జరుగుతుంది.