ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినెని ఎన్నో అంచనాలతో రెడ్ మూవీ చేసాడు. కానీ రెడ్ మూవీ రామ్ కి అనుకున్న హిట్ ఇవ్వలేకపోయింది. తర్వాత రామ్ ఎలాంటి మూవీ చేస్తాడో అనే ఆత్రుతలో ఫాన్స్ ఉన్న టైం లో కోలీవుడ్ దర్శకుడు లింగు స్వామితో బైలింగువల్ మూవీ ని మొదలు పెట్టాడు. అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ వచ్చిన ఈ ప్రాజెక్ట్ లో రామ్ తో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తో రొమాన్స్ కి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో మార్చ్ లోనే మొదలవుతుంది అనుకున్నారు.
కానీ రామ్ - లింగుస్వామి ప్రాజెక్ట్ పూర్తి నేరేషన్ ఇప్పుడే పూర్తయ్యింది. ఆ విషయం రామ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ఫైనల్ నేరేషన్ అయిపోయింది. లవ్ యూ లింగుసామి సార్. ఫుల్ కిక్కుతో సినిమాను మొదలు పెడుదాం.. Final Narration Done & How!!! @dirlingusamy love you sir!! Super duper kicked!!! Roll that camera I say!! అంటూ రామ్ ట్వీట్ చేసాడు. అంటే ఇప్పటివరకు రామ్ పూర్తి కథని వినలేదా? వినకుండానే లింగుస్వామితో సినిమాని ఫైనల్ చేశాడా? అనే డౌట్ ఇప్పుడు రామ్ ఫాన్స్ లో మొదలైంది. మరి రామ్ ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారానికి ధీటుగా ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని ప్రచారం జరుగుతోంది.