దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోంది అనిపిస్తుంది. గత రెండు రోజులుగా 50 వేలకి దిగువకు చేరిన కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా 18,59,469 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 54,069 మందికి పాజిటివ్‌గా తేలింది. వరుసగా రెండోరోజు కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. తాజాగా 1,321 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3,00,82,778కి చేరగా 3,91,981 మరణాలు సంభవించాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో ఇటీవల కాస్త వేగం కనిపిస్తోంది. జూన్ 23 నాటికి 30.16కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. నిన్న ఒక్కరోజే 64,89,599 మంది టీకాలు వేయించుకున్నారు.