Advertisementt

ఈ రూమర్స్ చూసి నా భార్య నవ్వుకుంటుంది

Thu 24th Jun 2021 11:59 AM
avika gor,manish,reacts to rumours,avika gor - manish  ఈ రూమర్స్ చూసి నా భార్య నవ్వుకుంటుంది
After Avika Gor, Manish Raisinghan Reacts to rumours ఈ రూమర్స్ చూసి నా భార్య నవ్వుకుంటుంది
Advertisement
Ads by CJ

సెలబ్రిటీస్ మీద రూమర్స్ అయినా, పుకార్లు అయినా కామన్ అనే విషయం తెలిసిందే. కొన్నిటిలో నిజాలు ఉంటాయి. కొన్నిట్లో అబద్దాలు ఉంటాయి. తాజాగా బాలిక వధూ ఫేమ్ అవికా గోర్ పై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లుకు కొడుతోంది. అదేమిటంటే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తర్వాత అవికా గోర్ సస్రూల్‌ సిమర్‌ కా సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ నటుడు మనీశ్‌ తో అవికా ప్రేమాయణం నడిపింది అని అప్పట్లోనే వార్తలొచ్చాయి. వాళ్ళు చాలా రోజులుగా డేటింగ్ లో ఉండి.. మనీష్ వలన అవికా బిడ్డకి కూడా తల్లయ్యింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్నీ అవికా గోర్ కొట్టిపారేసింది. మనీశ్‌ తో నాకు ప్రేమేమిటి. అతని వయసెమిటి.. నా వయసెమిటి అంటూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. 

తాజాగా ఈ విషయంలో మనీశ్‌ స్పందిస్తూ.. అవికా గోర్ నాకు మంచి ఫ్రెండ్. ఎన్నో ఏళ్లుగా నుంచి మేము ఇద్దరం స్నేహితులుగానే ఉన్నాం. అయితే మా స్నేహం గురించి వచ్చిన పుకార్లలో ఇది కూడా ఒకటి. అవికా కంటే వయసులో నేను 18 సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ మా మధ్యన ఏం లేదు. అసలు అవికా గోర్  ప్రస్తుతం తను మిలింద్‌ చంద్వాణీతో డేటింగ్‌లో ఉంది. వాళ్ల లైఫ్‌ ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా పోయినేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. ఇలాంటి రూమర్స్ చూసి నా భార్య నవ్వుకుంటుంది అంటూ అవికా తో రిలేషన్ పై మనీష్ ఇలా స్పందించాడు. 

After Avika Gor, Manish Raisinghan Reacts to rumours:

Manish Raisinghan Reacts to rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ