రామోజీ రావు గారు ఈనాడు పేపర్ తో సంచలనం సృష్టించి, ఈటివి మొదలు పెట్టి.. టెలివిజన్ రంగంలో సంచలనాలకు తెరలేపి.. రామోజీ ఫిలిం సిటీ అంటూ పెద్ద స్టూడియోని నిర్మించి.. ఉషాకిరణ్ మూవీస్ అంటూ సినిమాలను కూడా నిర్మించిన రామోజీ రావు గారు.. ఇప్పుడు మరో సంచలనానికి రెడీ కాబోతున్నారట. అది గత ఏడాది కరోనా లాక్ డౌన్ నుండి ఓటిటీలకు బాగా క్రేజ్ ఏర్పడింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ఓటిటి సంస్థల ముందు మరికొన్ని ఎదగడానికి కష్టపడుతున్నాయి. హాట్ స్టార్, జీ 5 లాంటి ఓటిటీలు కూడా బాగా పోటీ పడుతున్న టైం లో టాలీవుడ్ లో ఆహా, స్పార్క్ లాంటి ఓటిటీలు బయలు దేరాయి. లాక్ డౌన్ లో ఓటిటి ల హవా మొదలుకావడంతో.. అందరి చూపు ఓటిటీల మీదే పడింది.
ఇక తాజాగా ఈనాడు అధినేత రామోజీ రావు గారు కూడా ఓటిటి ని ఒకదానికి మొదలు పెట్టబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. ఇప్పటికే చాలా ఓల్డ్ మూవీస్ కి సంబందించిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని ఈటీవీ దక్కించుకుంది అని.. 200 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ఓటిటి ని రామోజీ రావు గారు మొదలు పెట్టబోతున్నారని, ఓటిటి యాప్ కోసం ఎక్కడా తగ్గేదే లే అంటున్నారట. మరి రామోజీ రావు గారు ఓటిటి రంగంలోకి అడుగుపెడితే.. అది ట్రెండ్ సెట్టర్ గా నిలవడం ఖాయమనే మాట వినిపిస్తుంది.