Advertisementt

జగన్‌ ప్రభుత్వంపై చిరు ప్రశంసలు

Tue 22nd Jun 2021 02:14 PM
chiranjeevi,tweet,chief minister ys jagan,ap government,corona vaccine,covid 19 vaccine  జగన్‌ ప్రభుత్వంపై చిరు ప్రశంసలు
Chiranjeevi praises YS jagan Government జగన్‌ ప్రభుత్వంపై చిరు ప్రశంసలు
Advertisement
Ads by CJ

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం గత ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించి రికార్డు సృష్టించింది. అంత పెద్దమొత్తంలో ఆంధ్రప్రదేశ్‌ల వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 

ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అసలైతే ఏపీ ప్రభుత్వం ఒక్క రోజు 8 లక్షల మంది వ్యాక్సిన్ వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ దానిని కూడా అధిగమించి ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ చేరవేశారు.

Chiranjeevi praises YS jagan Government:

Chiru tweet congratulations to Chief Minister YS jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ