వ్యాక్సిన్ పేరుతొ నిర్మాతకు టోకరా

Fraud under the name of vaccine

ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. కరోనా కట్టడికి కేవలం వ్యాక్సినేషన్ మాత్రమే అడ్డుకట్ట వేస్తుంది అంటూ ప్రజలు పెద్ద మొత్తంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఒకప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకోండిరా అంటే పారిపోయిన జనాలు.. ఇప్పుడు అదే వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది వ్యాక్సిన్ పేరుతొ భారీ మోసాలకు తెగబడుతున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులకి చిరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే యూనియన్లు కూడా తమ సబ్యులకు వ్యాక్సినేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇంకా కొంతమంది సినీమా ప్రముఖులు కూడా మంచి చేద్దామని.. తమ స్వంత ఖర్చుతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మొదలుపెట్టారు. ఆ వ్యాక్సినేషన్ కోసం హెల్త్ డిపార్ట్ మెంట్ అంటూ పరిచయమయిన నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ని నమ్మి నాగార్జున రెడ్డి  భార్య అకౌంట్ కి కొంత డబ్బుని పంపించారు. నాగార్జున రెడ్డి  నేను హెల్త్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాను, కేసీఆర్, కేటీఆర్ లతో మాట్లాడి వ్యాక్సిన్ ఇప్పిస్తానని భారీ మోసానికి తెర లేపాడు. ఈ వ్యాక్సినేషన్ కోసం కొంతమంది సినీ ప్రముఖులు ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు మేనేజర్ ఆ నాగార్జున రెడ్డి నమ్మి  బ్యాంకు అకౌంట్ కి లక్ష మనీ ట్రాన్స్ఫర్ చేసి.. వ్యాక్సిన్ డోసెస్ కోసం నాగార్జున రెడ్డికి ఫోన్ చెయ్యగా.. అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యకుండా, స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి ఖంగుతిన్నారు.

ఆ ఫోన్ నెంబర్ మరియు మనీ ఫోర్వర్డ్ చేసిన అకౌంట్ రమా దేవి అనే పేర పై వుండటంతో మోసపోయాము అని గ్రహించి..నాగార్జునరెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో సురేశ్‌బాబు మేనేజర్ ఫిర్యాదు చేశారు. అయితే నాగార్జున రెడ్డిని నాలుగు రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

Producer Suresh Babu get cheated under the name of vaccine

producer suresh babu
celebrities
nagarjuna reddy
covid vaccine
corona vaccine