Advertisementt

టైగర్ ష్రాఫ్‌ డేటింగ్ పై తండ్రి స్పందన

Tue 22nd Jun 2021 12:38 PM
jackie shroff,tiger shroff and disha patani,tiger shroff,disha patani,tiger shroff - disha patani dating  టైగర్ ష్రాఫ్‌ డేటింగ్ పై తండ్రి స్పందన
Jackie Shroff on Tiger- Disha dating rumour టైగర్ ష్రాఫ్‌ డేటింగ్ పై తండ్రి స్పందన
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో చాలా ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకోకుండా.. ఎంజాయ్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ - అలియా భట్ లు కరోనా కొలిక్కి వస్తే పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. అలాగే అర్జున్ కపూర్ - మలైకా అరోరా పెళ్లి ఊసెత్తకుండా ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్న జంట. ఇక మరో జంట టైగర్ ష్రాఫ్‌ అండ్ దిశా పటాని. వీరిద్దరూ రెస్టారెంట్స్, పార్టీలు, మాల్దీవులు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ జంటగా దర్శనమిచ్చే ఈ జంట పెళ్లి పేరు మాత్రం ఎత్తరు. తాజాగా వీరి ప్రేమాయణంపై టైగర్ తండ్రి, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌ స్పందించారు.

టైగర్ ష్రాఫ్ - దిశా పటాని లు చాలామంచి ఫ్రెండ్స్ అని, వారిద్దరూ సుమారుగా ఆరేళ్ళ నుండు డేటింగ్ లో ఉన్నారని, వారిద్దరి బంధం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేను అంటూ షాకిచ్చారు. పెళ్లి త్వరలో ఉంటుంది అని చెబుతారనుకుంటే.. వారిద్దరి బంధం ఫ్యూచర్ లో ఎక్కడివరకు వెళుతుందో అనే ఆలోచన లేదంటూ చెప్పారు. టైగర్ వ్యక్తిగత జీవితంలో 25 ఏళ్ళ నుండే డేటింగ్ లో ఉన్నాడు.. ప్రస్తుతం టైగర్ ఫోకస్ మొత్తం పని మీదే వుంది. ప్రేక్షకులు నచ్చే చిత్రాలను చెయ్యాలని, వారు మెచ్చుకునే చిత్రాలను చెయ్యాలని అతను భవిస్తున్నాడంటూ టైగర్ - దిశా ప్రేమాయణం పై ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ స్పందించారు.

Jackie Shroff on Tiger- Disha dating rumour:

Jackie Shroff Has This to Say About Tiger Shroff and Disha 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ