తెలంగాణ లో లాక్ డౌన్ ముగిసింది. విద్యాశాఖ.. తమ కసరత్తులు స్టార్ట్ చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేసినా.. మరో వారం రోజుల్లో సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటిస్తామని, జులై 1 నుండి పిజి, డిగ్రీ కళాశాలలు ఓపెన్ చేస్తున్నట్టుగా.. విద్యార్థులు తరగతులకు హాజరవ్వాల్సిందిగా సబితా ఇంద్రా రెడ్డి విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన మీటింగ్ లో చెప్పారు. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది. ఇక ఇంటర్, హై స్కూల్ తరగతుల విషయంలో.. అధికారులతో చర్చించి, పేరెంట్స్ అనుమతితో కొద్దీ రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, ఓపెన్ తరగతులా, లేదంటే ఆన్ లైన్ విద్యా అనేది త్వరలోనే ప్రకటిస్తామని సబితా చెప్పారు. అలాగే తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.