తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ చాలా వరకు కంట్రోల్ కి రావడంతో కేసీఆర్ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసింది. ఆదివారం నుండి తెలంగాణాలో జనజీవనం యాధస్థితికి చేరుకుంది. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రజలంతా తమ తమ పనుల కోసం రోడ్లమీదకు వచ్చారు. మాస్క్ పెట్టుకోకపోతే 1000 జరిమానా విధిస్తామని, భౌతిక దూరం తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.
ఇకతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,537 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈసారి కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు వచ్చాయి. జిల్లాల్లో ఎక్కడా 100కు మించి కరోనా కేసులు నమోదు కాలేదు. అతితక్కువగా నిర్మల్ జిల్లాలో 1 పాజిటివ్ కేసు గుర్తించారు. అదే సమయంలో 1,707 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,576కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,14,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,93,577 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,246 మంది చికిత్స పొందుతున్నారు.