పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పమ్ కోషియమ్ మలయాళం రీమేక్ కరోనా సెకండ్ వేవ్, పవన్ అనారోగ్య కారణాలతో షూటింగ్ ఆగింది. ఇప్పడు సెకండ్ వేవ్ తగ్గింది.. సినిమా ఇండస్ట్రీ కదిలింది. దానితో పాటుగానే పవన్ కళ్యాణ్ - రానా కూడా ఏకే రీమేక్ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ - రానా మధ్యన యాక్షన్ సన్నివేశాలను తాజాగా మొదలు కాబోయే కొత్త షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట.
అయితే ఈ సినిమాలో రాయలసీమ గాయకుడు పెంచల్ దాస్ ఓ పాట పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో నాని కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దమ్ము చూడూ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అలాగే ఆయన పాడిన మరో రెండు మూడు పాటలు ఆంటే హిట్ అవడంతో ఇప్పుడు పవన్ సినిమాలో పెంచల్ దాస్ తో ఓ ఫోక్ సాంగ్ పండించాలని ఏకే రీమేక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో పాటుగా మేకర్స్ భావిస్తున్నారట. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ ని పెంచల్ దాస్ తో పాడిస్తే బావుంటుంది అని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ మేకర్స్ కి సూచించడంతో ఇప్పుడు ఆ పనిలో పడిందట టీం.