యాంకర్ ప్రదీప్.. ఏపీ రాజధాని గురించి ఓ ఛానల్ లో జరిగిన స్పెషల్ షో లో మాట్లాడాడని.. ఏపీ రాజధాని విశాఖ అంటూ మాట్లాడడంపై అమరావతి జేఏసీ ప్రదీప్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందనే. ప్రదీప్ ఓ షో లో భాగంగా ఆంద్రప్రదేశ్ రాజధాని విశాఖ అని మట్లాడడంపై ఈ వివాదం చెలరేగింది. ప్రస్తుతం మూడు రాజధానుల విషయం కోర్టు కేసులో ఉంది. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ అంటూ వైసిపినేతలు చెబుతున్నా.. అమరావతి ఉద్యమకారులు ఒప్పుకోవడం లేదు.
దానితో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యకం చేసిన ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు ప్రదీప్ ఇంటి ముందు ధర్నాకు దిగారు.
దానితో యాంకర్ ప్రదీప్ ఈ వివాదంపై ఓ వీడియో ద్వారా స్పందించాడు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనని క్షమించాలని, ఎవరినైనా కించపరచాలని కానీ, లేదంటే హేళన చెయ్యాలనే ఉద్దేశ్యం తనకి లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. ఎవరినైనా బాధపెట్టినా.. వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇది ఉద్దేశ్యం పూర్వకంగా చేసింది కాదు.. రీసెంట్ గా జరిగిన ఓ షో లో రాష్ట్రం - దాని క్యాపిటల్ విషయంలో మొదలైన సంభాషణ పక్కదారి పట్టి.. వేరే విధంగా అర్ధంవడంతో.. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఎవరైనా బాధపడితే వారికీ తాను క్షమాపణలు చెబుతున్నట్టుగా, దయచేసి తనని అర్ధం చేసుకోండి అంటూ ఆ వీడియో లో చెప్పుకొచ్చాడు ప్రదీప్.