ఈ రోజు యోగ డే సందర్భంగా రకుల్ ప్రీత్ మెసేజ్ తో పాటుగా.. రకుల్ ప్రీత్ మరో విధంగా మీడియాకి న్యూస్ గా మరింది. ఆమె ఓ ఇంగ్లీష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి తెలుగు అవకాశాలు రావడం లేదని చెప్పినట్టుగా.. ఆ పత్రికలో న్యూస్ రావడంతో రకుల్ ఆ పత్రికపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో తాను చాలా బిజీగా ఉన్నాను అని, మరోపక్క సౌత్ అవకాశాలు కూడా వస్తున్నాయని చెబుతుంది రకుల్. దే దే ప్యార్ దే మూవీ తర్వాత హిందీలో మంచి క్రేజ్ వచ్చి అక్కడ వరస ప్రాజెక్ట్స్ చేస్తున్న కారణంగానే తాను సౌత్ సినిమాలు ఒప్పుకోలేకపోతున్నాను అని, కరోనా టైం లోనూ చేతినిండా సినిమాలు ఉన్నాయని చెబుతుంది.
నాకు పని చెయ్యడం అంటే ఇష్టం. హిందీ, తెలుగు సినిమాలను రెండిటిని బ్యాలెన్స్ చేసుకోగలను, నా డేట్స్ ని ఓ పద్దతి ప్రకారమే ప్లాన్ చేసుకుంటాను. టైం గురించి దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలిస్తే.. ఎలా అయినా బిజీ అవ్వొచ్చు. ఇక హిందీలో చాలా సినిమాలు చేస్తున్నాను కానీ, అక్కడ భీబత్సమైన డాన్స్ లు, సాంగ్స్ ఉన్న సినిమాల్లో ఇంకా చెయ్యలేదు. అక్కడ కూడా అలాంటిది చెయ్యాలనే కోరిక. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. అందుకే తెలుగు సినిమాలు తగ్గించాను. హిందీలో ఆఫర్స్ కారణంగానే తెలుగు సినిమాలకు ఓకె చెప్పలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చింది రకుల్.