కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజియస్ట్ పాన్ ఇండియా ఫిలిం సలార్ మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదలు కాబోతుంది. ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇకపై ఫిలిం సిటీలోని స్పెషల్ సెట్ లో మొదలు కాబోతుంది. అయితే ప్రసుతం ఇండియన్ సినిమాల్లో పార్ట్ వన్ పార్ట్ టు ట్రెండ్ నడుస్తుంది. బాహుబలి పార్ట్ వన్, టు లతో రాజమౌళి సక్సెస్ సాధించడంతో.. ఇప్పడూ చాలా సినిమాలు అదే బాట పట్టాయి. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ వన్ తో సెన్సేషనల్ హిట్ కట్టి.. దానికి సీక్వెల్ గా పార్ట్ టు ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
మరోపక్క టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబో పుష్ప మూవీ పార్ట్ వన్, టు లుగా విడుదలకాబోతుంది. ఇప్పుడు అదే బాటలో సలార్ కూడా నడవబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రశాంత్ నీల్ సలార్ ని రెండు పార్ట్ లుగా విడుదల చెయ్యబోతున్నట్టుగా టాక్. అలా అయితే నిర్మాతలకు బెన్ఫిట్ అంటున్నారు. కేజిఎఫ్ రెండు భాగాలుగా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చినట్టుగా సలార్ ని రెండు పార్ట్ లుగా డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారట. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పరంగా సలార్ కి రెండు పార్ట్స్ ఉంటే బెటర్ అనే ఆలోచన చేసున్నారట. సినిమా మొదలైనప్పుడు లేని ఆలోచన ఇప్పుడే పుట్టింది అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో అనేది తెలియాల్సి ఉంది.