రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ చడీ చప్పుడు లేకుండా షూటింగ్ మొదలు పెట్టేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడిన ఆర్.ఆర్.ఆర్ చివరి షెడ్యూల్.. తాజాగా ఈ సోమవారం మొదలయ్యింది. అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. ఈ రోజు నుంచి అల్లూరి సీతారామరాజు పోర్షన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించనున్నారు. దానితో రామ్ చరణ్ ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ సెట్స్ కి వచ్చేసాడు. అయితే రామ్ చరణ్ తో పాటుగా ముంబైకి చెందిన ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ కూడా ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో అడుగుపెట్టాడు.
రామ్ చరణ్ తో హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్ తీసుకున్నసెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా అది కాస్త వైరల్ అయ్యింది. ఇక రామరాజు పాత్రకి సంబందించిన సన్నివేశాలతో పాటుగా, మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తవుతుంది అని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్ వర్క్స్ కూడా పూర్తి చేస్తే సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అయినా అవ్వొచ్చని అంటున్నారు మరోపక్క ఆర్.ఆర్.ఆర్ ఇక ఈ ఏడాది విడుదల కాదు.. వచ్చే సంక్రాంతికే ఆర్.ఆర్.ఆర్ రాక.. త్వరలోనే రాజమౌళి హీరోలని సంప్రదించి.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అంటున్నారు.