మంచు విష్ణు పేరు ఈ రోజు ఉదయం నుండి మార్మోగిపోతోంది. అది మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడనే న్యూస్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ ప్రకాష్ రాజ్ పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద పోటీకి మంచు విష్ణు ముందుకు వచ్చాడనే టాక్ వినిపిస్తుంది. అది నిజమో.. కాదో.. కానీ.. మంచు విష్ణు మా ఎన్నికల కోసం గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అదెలా అంటే మంచు విష్ణు ఆయన తండ్రి మోహన్ బాబు తో కలిసి సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ని ఆయన స్వగృహంలో కలవడం హాట్ టాపిక్ గా మారింది.
మంచు మోహన్ బాబు - మంచు విష్ణు కలిసి కృష్ణ గారిని కలిశారు. అది మంచు మోహన్ బాబు నటిస్తున్న సన్ అఫ్ ఇండియా ప్రమోషన్స్ కోసమా? లేదంటే మంచు విష్ణు పోటీ చెయ్యబోతున్న మా ఎన్నికల్లో ఆయనకి మద్దతు కోసం కృష్ణ గారిని కలిసారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మంచు విష్ణు మా ఎన్నికల్లో దిగడం ఖాయం. అందుకే మంచు విష్ణు ఇలాంటి ప్రయత్నాలు చేసి.. మద్దతు కూడగట్టుకుంటున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అయితే మంచు విష్ణు - మోహన్ బాబు - కృష్ణ గారి మీటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.