Advertisementt

మొదలు పెడితే ఆగేదెలే.. అంటున్న రాధేశ్యామ్

Wed 23rd Jun 2021 06:22 PM
radhe shyam pan india film,prabhas radhe shyam,pooja hegde radhe shyam,radhakrishna radhe shyam movie,uv creations radhe shyam,radhe shyam movie,radhe shyam update  మొదలు పెడితే ఆగేదెలే.. అంటున్న రాధేశ్యామ్
Radhe Shyam latest update మొదలు పెడితే ఆగేదెలే.. అంటున్న రాధేశ్యామ్
Advertisement
Ads by CJ

కరోనా పాండమిక్ సిట్యువేషన్ అందరిని అన్నిటిని మార్చేసింది. సినిమా ఇండస్ట్రీ మరోసారి అతలాకుతలం అయ్యింది. గత ఏడాది లాక్ డౌన్ లో ఆరు నెలల పాటు షూటింగ్స్ నిలిచిపోయి సినిమాలన్నీ ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అయితే.. మరోసారి ఈ ఏడాది కరోనాకి రెండు నెలలపాటు బలయ్యింది. దానితో మరోసారి సినిమా రిలీజ్ డేట్స్ మారిపోయాయి. ఇక గత రెండేళ్లుగా లాక్ డౌన్, ఇతరత్రా కారణాలతో వాయిదా పడిన ప్రభాస్ రాధేశ్యామ్ ఇప్పుడు కూడా అనుకున్న టైం రావడం కష్టమే. ఎందుకంటే ఇంకా ఓ సాంగ్ చిత్రికరణతో పాటుగా, విఎఫ్ఎక్స్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. జులై 30 న సినిమా విడుదలకు డేట్ ఇచ్చింది టీమ్. 

ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో సినిమా షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి. అందులో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఉంది. జులై ఫస్ట్ వీక్ నుండి రాధేశ్యామ్ బ్యాలెన్స్ షూట్ మొదలు కాబోతుంది. ఓ సాంగ్ చిత్రీకరణతో పాటుగా, ఇంకొన్ని సన్నివేశాలు కూడా  ఈ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని చిత్ర బృందం చూస్తుందట. అంటే ప్రభాస్-  పూజ హెగ్డే మీద సాంగ్, అలాగే మిగతా సన్నివేశాల షూట్ ని ఒకే షెడ్యూల్ లేపెయ్యబోపుతున్నారట. ఒక్కసారి మొదలైతే ఆగేదెలా అంటుందట రాధేశ్యామ్ టీం. రాధాకృష్ణ, నిర్మాతలు యూవీ వారు రాధేశ్యామ్ ని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చూస్తున్నారట.

Radhe Shyam latest update:

Prabhas Radhe Shyam update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ