కోలీవుడ్ ప్రేమ పక్షులు నయన్ - విగ్నేష్ ల పెళ్లి విషయంలో ఫాన్స్ మాత్రమే కాదు.. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ జంట పక్షులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతున్నా.. నయన్ కానీ, విగ్నేష్ శివన్ కానీ పెళ్లి పేరెత్తడం లేదు. ఇద్దరూ జంట పక్షుల్లా విహరిస్తూ ఎంజాయ్ చెయ్యడమే కాదు... తమ తమ సినిమా షూటింగ్స్ లో బిజీగా వుంటున్నారు తప్ప.. పెళ్లి విషయం తేల్చకుండా నాన్చుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఈ జంట చెన్నై నుండి కొచ్చి కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారు. ఆ కొచ్చి ఎయిర్ పోర్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.
అయితే తాజాగా విగ్నేష్ శివన్ ఇన్స్టా లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా.. అందులో నయన్ కి సంబందించిన ప్రశ్నలే విగ్నేష్ కి ఎక్కువగా ఎదురయ్యాయి. విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలతో పాటుగా, నయనతార నటించే సినిమాల విషయాలను అడిగారు. నయన్ తాజా చిత్రం నెత్రికన్ ట్రైలర్ చూశాం. ట్రైలర్ ఎంతో బాగుంది. సినిమా కూడా సూపర్‌గా ఉంటుందని అనుకుంటున్నాను అని అడగ్గా.. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ సినిమా చాల బావుంది.. మీకు కూడా నచ్చుతుంది అని సమాధానము చెప్పాడు విగ్నేష్. ఇక నయనతారాలో మీకు నచ్చే లక్షణం ఏమిటి అని అడిగితే.. ఆమెలోని ఆత్మస్థైర్యం అంటే చాలా ఇష్టమని చెప్పిన విగ్నేష్ నయన్ తో తాను దిగిన ఫొటోస్ లో కెల్లా ఇష్టమైన ఫోటో ని అభినులతో షేర్ చేసుకున్నాడు.