తెలంగాణాలో లాక్ డౌన్ ముగిసి అన్ లాక్ ప్రక్రియ మొదలైపోయింది. అందులో భాగంగా పార్క్ లు, థియేటర్స్ ఓపెన్, జులై ఫస్ట్ నుండి విద్యాసంస్థల ఓపెన్ అంటూ కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించేసింది. దానితో థియేటర్స్ ఓపెన్ కాబోతున్నాయి. అయితే అది 50 పర్సెంట్ అక్యుపెన్సీనా? లేదంటే 100 పర్సెంట్ అక్యుపెన్సీనా? అనేది తేల్చలేదు కానీ.. థియేటర్స్ మాత్రం ఓపెన్ అవుతున్నాయి. మరి థియేటర్స్ ఓపెన్ అయితే కొత్త సినిమాల సందడి కనిపించాలి. కానీ ప్రస్తుతం ఎవరూ రిలీజ్ డేట్ ప్రకటించడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారో తెలియడం లేదు. సెకండ్ వేవ్ కరోనా అంతలా భయపెట్టేసింది.
థియేటర్స్ ఓపెన్ చేసినా.. ప్రేక్షకులు ధైర్యంగా సినిమాలు చూడడానికి వస్తారా? ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ లేదు. ఓటిటీలలో కొత్త సినిమాల జోరు లేదు. దానితో కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ఇస్తే అయినా.. ప్రేక్షకుల కదలిక ఉండి.. బాక్సాఫీసు గలగలలు సివినిపిస్తాయో లేదో చూడాలి. దర్శకనిర్మాతలు అయితే కామ్ గా ఉన్నారు. ఒక వారం పది రోజుల తర్వాత షూటింగ్స్ పూర్తి చేసుకుని.. రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాల్లో కదలిక వస్తుంది. మరి లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, నారప్ప, దృశ్యం.. ఇలా షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ వరుసబెట్టి థియేటర్స్ లోకి వచ్చేస్తాయి.. కాని అది ఎప్పుడు అనేది క్లారిటీ వస్తే.. ప్రేక్షకులకు ఊరట.