మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యాక ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహ రెడ్డి మూవీస్ చేసేసి.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 లో కొత్తగా లుక్ ని మార్చని చిరు సైరా కోసం టోటల్ గా ఉయ్యాలవాడ లుక్ లోకి మారిపోయారు. ఇక ఆచార్య లో నక్సలైట్ గా చిరు లుక్ లో పెద్దగా కొత్తదనం కనిపించలేదు. ఇప్పుడు చిరు చెయ్యబోయే నెక్స్ట్ మూవీ లూసిఫెర్ రీమేక్ కోసం చిరు లుక్ చేంజ్ చెయ్యాల్సిందే. అంటే మలయాళంలో మోహన్ లాల్ మధ్యవయస్కుడిగా కనిపించాడు. అంతేకాదు.. వేదాళం రీమేక్ కూడా చిరు త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు.
అందులోనూ అజిత్ కాస్త ఓల్డ్ గా డిఫరెంట్ లుక్ లోనే కనిపించాడు. ఇక లాక్ డౌన్ లో కొన్నాళ్లుగా చిరు బయట కనిపించడం లేదు. మొన్నామధ్యన చిరు బ్లడ్ బ్యాండ్ లో రక్తదానం చెయ్యడానికి వచ్చారు. అయితే చిరు తాజాగా ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వీడియో లో నీలకంఠపురం దేవాలయాలు తెరిచే సందర్భంగా చిరు శుభాకాంక్షలు తెలిపారు. అంతవరకు ఓకె ఆ వీడియో లో చిరు లుక్ చూస్తేనే షాకవుతారు. తలపై హెయిర్ కొద్దిగా కనిపిస్తుండగా.. తెల్లని చిన్నపాటి గడ్డంతో చిరు కొత్తగా కాదు సరికొత్త లుక్ లో కనిపించాడు. మరి ఈ లుక్ లూసిఫెర్ రీమేక్ కోసమో, లేదంటే వేదాళం రీమేక్ కోసమో.. ప్రస్తుతం అయితే చిరు సీన్స్ ఆచార్యలో ఫినిష్ అయ్యింది. అంటే చిరు కొత్త లుక్ ఆ కొత్త సినిమాల కోసమే అనే అనుమానం వస్తుంది.