మే 11 నుండి తెలంగాణాలో లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా కేసులు దానితో పాటుగా మరణాలు సెకండ్ వేవ్ లో పెరిగిపోవడంతో హుటాహుటిన సీఎం కేసీఆర్ తెలంగాణాలో 20 గంటల కఠిన లాక్ డౌన్ అమలులోకి తెచ్చారు. నాలుగు విడతలుగా లాక్ డౌన్ ని పొడిసిగిస్తూ.. ఆంక్షలను సడలింపులు చేస్తున్న ప్రభుత్వం, రేపు 20 రోజు ముగియబోతున్న లాక్ డౌన్ ని పూర్తిగా ఎత్తివేసే నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రగతి భావంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. దీనితో తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం యాధస్థితికి వచ్చేసినట్టే.