Advertisementt

పప్పు-తుప్పు అంటూ రెచ్చిపోయిన నాని

Sat 19th Jun 2021 12:43 PM
kodali nanim ap minister kodali,sensational comments,chandrababu naidu,nara lokesh  పప్పు-తుప్పు అంటూ రెచ్చిపోయిన నాని
Nani Sensational comments on Chandrababu and Lokesh పప్పు-తుప్పు అంటూ రెచ్చిపోయిన నాని
Advertisement
Ads by CJ

ఏపీ మంత్రి కొడాలి నాని ప్రతి పక్షంపై ఎప్పటికప్పుడు అంటే అస్సాంబ్లీ లో కానీ, మీడియా ప్రెస్ మీట్స్ లో కానీ భూతు పదాలతో రెచ్చిపోతుండడం తరుచు చూస్తూనే ఉన్నాము. తాజాగా కొడాలి నాని నారా లోకేష్ - చంద్రబాబు లపై పప్పు - తుప్పు అంటూ రెచ్చిపోయి మట్లాడారు. నారా లోకేష్‌ పిచ్చికుక్కలా అరుస్తున్నాడని, పప్పు.. తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ  తండ్రి కోడుకులిద్దరూ ఇంట్లో కూర్చుని జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారని, చంద్రబాబు పెట్టిన బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని మండిపడ్డారు. రైతులకు బాబు పెట్టిన రూ. 4వేల కోట్లు బకాయిలు చెల్లించామని, రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. 

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడని కొడాలి నాని కొనియాడారు. 21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయమని  కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఊక, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా రాష్ట్రం మీదకి వదిలారని, చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని, రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని చట్టం తెచ్చిన వ్యక్తి బాబు అని ఫైర్‌ అయ్యారు. టీడీపీ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతల హత్యలు జరిగాయని, గ్రామాల్లో ఘటనలను తమపై ఆపాదించడం సమంజసమా అని మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. శత్రువులతో కూడా శభాష్ అనిపించుకునే వ్యక్తి సీఎం జగన్ అంటూ ఏపీ సీఎం జగన్ ని కొడాలి నాని ఆకాశానికెత్తేసారు.

Nani Sensational comments on Chandrababu and Lokesh:

AP Minisher Kodali Nani Sensational Comments on Chandrababu Naidu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ