చందమామ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. లక్ష్మి కళ్యాణం దగ్గర నుండి ఇప్పుడు ఆమె నటిస్తున్న ఆచార్య సినిమా వరకు కాజల్ ఫిజిక్ లో కానీ, ఆమె గ్లామర్ లో కానీ, పెరఫార్మెన్సు లో కానీ ఎలాంటి మార్పు లేదు. ఇన్నాళ్ళుగా కాజల్ అగర్వాల్ కెరీర్ లో చిన్న చిన్న కుదుపులు ఉన్నాయి, ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. గత ఏడాది పర్సనల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అయినా.. కెరీర్ ని వదల్లేదు. పెళ్లయ్యాక మరింత జోరు చూపిస్తుంది కాజు పాప్. సినిమాలు, వెబ్ సీరీస్ లు కాజల్ కెరీర్ మూడు పువ్వులు - ఆరు కాయల మాదిరి వెలిగిపోతుంది. ఆచార్య లో చిరు సరసన జోడి కట్టిన కాజల్.. లేటెస్ట్ గా నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీలో ను నటిస్తుంది.
మరోపక్క నాని మీట్ క్యూట్ లోనూ కాజల్ ఓ కీలక పాత్ర చేయబోతుంది అని తెలుస్తుంది. ఇక కోలీవుడ్ లో ఇండియన్ 2 మొదలైతే అక్కడా బిజినే. అలాగే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఓ వెబ్ సీరీస్ కూడా చేసింది కాజల్. కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుండి స్టిల్ ఇప్పటివరకు కాజల్ అగర్వాల్ తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించింది. నేడు కాజల్ అగర్వాల్ బర్త్ డే.. దానితో సినిమా ప్రముఖులు కాజల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలతో కాజల్ పేరు మార్మోగిపోతోంది. మరి నేడు పుట్టిన రోజు చందమామ కాజల్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.