ప్రస్తుతం హీరోయిన్స్ ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ తమ పెట్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. పెట్స్ తో ఉన్నప్పుడు వారి క్యూట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హీరోయిన్స్ లో ఛార్మి అందరికన్నా ముందు ఉంటుంది. అలాగే అంజలి లాంటి వాళ్ళు కూడా తమ బుజ్జి కుక్కపిల్లలతో సందడి చేస్తున్న ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మిక తన పెట్ తో ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా కీర్తి సురేష్ కూడా తన పెట్ తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రష్మిక ప్రస్తుతం ముంబై లో ఉంది. అక్కడ తన పెంపుడు కుక్కని ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసిన ఫోటో తో పాటుగా Just a little of Aura and me on your feed! 🌸✨❤️ అంటూ షేర్ చేసింది.
ఇక కీర్తి సురేష్ తన పెంపుడు కుక్కపిల్లని తీసుకుని బీచ్ ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ తన కుక్కపిల్లతో రకరకాల విన్యాసాలు చేస్తూ బీచ్ ఒడ్డున ఆ కుక్కపిల్లతో కలిసి ఎంజాయ్ చేసిన క్యూట్ మూమెంట్స్ ని.. The perfect weather, the perfect companion & and a picnic by the beach! 🧺 అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి రష్మిక పాన్ ఇండియా మూవీ, బాలీవుడ్ మూవీస్ తో దున్నేస్తుంటే.. కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ మూవీ తో పాటుగా తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక కుక్క తో ఉన్న సెల్ఫీ.. హైలెట్ అవ్వగా.. కీర్తి సురేష్ తన కుక్కపిల్లతో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.