రామ్ చరణ్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమా షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఆ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాక రామ్ చరణ్ ఆరు నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని మెగా ఫాన్స్ చాలా ఫీలవుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య ల తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో మూవీ కమిట్ అయ్యాడు. కానీ శంకర్ కి ఇండియన్ 2 మూవీ షూటింగ్ అడ్డంకిగా మారింది. కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 మిగతా షూటింగ్ చెయ్యాలని నిర్మాతలు పట్టుబట్టడంతో రామ్ చరణ్ - శంకర్ మూవీ లేట్ అవుతుంది అనుకుంటున్నారు.
అయితే శంకర్ ఇండియన్ 2 మూవీ సంగతి ఎలా ఉన్నా.. రామ్ చరణ్ తో చేసే సినిమా కోసం తయారైపోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా టాక్. తన అసిస్టెంట్స్ తో రామ్ చరణ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలు పెట్టేసి.. దగ్గరుండి మరీ చేయిస్తున్నారట. అంతేకాకుండా హీరోయిన్ విషయంలోనూ కసరత్తులు ప్రారంభించారని.. రామ్ చరణ్ సరసన రష్మిక అయినా, లేదు కియారా అద్వానీ అయినా ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. ఏది ఎలాగున్నా రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే అంటే ఆగష్టు నుండి శంకర్ తో మొదలు కాబోయే పాన్ ఇండియా మూవీ సెట్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు.