Advertisementt

శేఖర్ కమ్ములతో ధనుష్

Thu 17th Jun 2021 09:46 PM
sekhar kammula,kollywood hero dhanush,love story director sekhar kammula,sekhar kammula,hero dhanush,sekhar kammula - dhanush combo fix  శేఖర్ కమ్ములతో ధనుష్
Sekhar Kammula - Dhanush to team up? శేఖర్ కమ్ములతో ధనుష్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల సినిమాలకు స్పెషల్ ప్రేక్షకులు ఉంటారు. ఫ్యామిలీ, అండ్ మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని శేఖర్ కమ్ముల కూర్చులకి అతుక్కుపోయేలా ఫీల్ గుడ్ మూవీస్ అందించగలరు.  ఫిదా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ముల సాయి పల్లవి - నాగ చైతన్య కాంబోలో లవ్ స్టోరీ తెరకెక్కించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లవ్ స్టోరీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తర్వాత కోలీవుడ్ హీరో తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మూవీస్ తెలుగులో డబ్ అవడమే కాదు.. ఆయన సినిమాలు చాలావరకు తెలుగు హీరోలు రీమక్స్ చేస్తుంటారు. అయితే ధనుష్ ఎప్పటినుండో టాలీవుడ్ డైరెక్ట్ మూవీ చెయ్యబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ధనుష్ నటించిన జగమే తంతీరం ఒకేసారి 17 భాషల్లో నెట్ ఫ్లిక్స్ నుండి రిలీజ్ కాబోతుంది. అంతేకాకుండా ధనుష్ తమిళ్ నుండి హిందీ భాషల్లోనూ దున్నేస్తున్నాడు. తాజాగా హాలీవుడ్ ఫిలిం కూడా చేస్తున్నాడు. దాని కోసమే ధనుష్ ఫ్యామిలీ తో సహా అమెరికాలో ఉన్నాడు. అయితే ధనుష్ ఎప్పటినుండో స్ట్రయిట్ తెలుగు మూవీ చేస్తాడని అంటున్నారు.. ఇప్పుడు అదే మూవీ శేఖర్ కమ్ములతో కలిసి చేయబోతున్నాడని.. ధనుష్ - శేఖర్ కమ్ముల మూవీ కి కథా చర్చలు పూర్తయ్యి.. ఆ సినిమాకి సంబందించిన ప్రకటన కూడా రేపు ఇవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియాలో  ప్రచారం జోరుగా సాగుతుంది. 

Sekhar Kammula - Dhanush to team up?:

Sekhar Kammula - Kollywood hero Dhanush Combo Fix?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ