Advertisementt

ఎన్టీఆర్ - కియారా ఫిక్స్: దానితోపాటే..

Thu 17th Jun 2021 08:42 PM
kiara advani - ntr combo,ntr30,ntr,kiara advani news,kiara advani,koratala - ntr combo  ఎన్టీఆర్ - కియారా ఫిక్స్: దానితోపాటే..
Kiara Advani Huge Remuneration for NTR30 ఎన్టీఆర్ - కియారా ఫిక్స్: దానితోపాటే..
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో కలిసి పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కొట్టిన ఈ కాంబో.. ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని కొట్టాలనే కసితో ఉంది. ప్రస్తుత ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ చివరి షెడ్యూల్ లోను, కొరటాల శివ ఆచార్య చివరి షెడ్యూల్ షూటింగ్స్ ముగిస్తే.. ఎన్టీఆర్ - కొరటాల కాంబో పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కియారా అద్వానీ రొమాన్స్ చేయబోతుంది అని తెలుస్తుంది. ఈమధ్యనే కియారా కూడా ఓ సౌత్ మూవీ చెయ్యబోతున్నట్టుగా హింట్ ఇచ్చేసరికి.. ఎన్టీఆర్ - కియారనే ఫిక్స్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది కాబట్టి కియారా NTR30 కోసం భారీగా డిమాండ్ చేసింది అనే టాక్ నడుస్తుంది. సౌత్ లో వినయ విధేయరామ ప్లాప్ అయినా, భరత్ అనే నేనులో కియారా గ్లామర్ కి మంచి మార్కులు పడడం, మరోపక్క బాలీవుడ్ లో పాప క్రేజ్ బాగా ఉండడంతో NTR30 కోసం కియారా 3 కోట్లు డిమాండ్ చేసినా నిర్మాతలు ఆలోచించకుండా అడిగింది ఇస్తున్నారట. మరి ఇప్పుడు కియారా NTR30 మాత్రమే కాకుండా రామ్ చరణ్ - శంకర్ కాంబో ఫిలిం విషయంలోనూ ఆమె పేరు పరిశీలనలో ఉంది అంటున్నారు. 

Kiara Advani Huge Remuneration for NTR30:

Kiara Advani - NTR combo fixed?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ