రవితేజ పై రెమ్యునరేషన్ విషయంలో గత కొంతకాలంగా ఏవేవో న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రవితేజ రెమ్యునరేషన్ విషయంలో చాలా సినిమాలు వదులుకున్నాడనే టాక్ కూడా ఉంది. క్రాక్ ముందు వరకు రవితేజకి వరస ప్లాప్స్ ఉన్నాయి. అయినా రవితేజ తన పారితోషకాన్ని తగ్గించుకోలేదనే ప్రచారం జరిగింది. ఇక క్రాక్ హిట్ అయ్యాక రవితేజ పారితోషకం మరింతగా పెరిగిపోయింది అని అన్నారు. క్రాక్ సినిమాకి పారితోషకం కింద నైజాం రైట్స్ తీసుకున్న రవితేజకి ఆ సినిమా హిట్ తో 16 కోట్లు దక్కాయి. అంటే అది రవితేజ పారితోషకం కింద లెక్కే.
ఇక తాజాగా ఖిలాడీలో నటిస్తున్న రవితేజ ఈ సినిమా పారితోషకం విషయంలోనూ క్రాక్ నే ఫాలో అవుతున్నాడట. అంటే ఖిలాడీ నైజాం హక్కులని కూడా రవితేజ సొంతం, చేసుకున్నాడట. ఇక దానికి ఎంతొస్తే అంత ఆయన పారితోషకం కింద సెటిలవుతుంది. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి నిర్మాతలు రవితేజ కి ఏకంగా 15 కోట్లు పారితోషకం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. రవితేజ కొత్త డైరెక్టర్ శరత్ మండా తెరకెక్కించబోయే సినిమాలో నటించబోతున్నాడని.. ఈ సినిమాలో రవితేజ ఒక ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో రాయలసీమ స్లాంగ్ లో మట్లాడబోతున్నాడట. ఈ సినిమాకే రవితేజ 15 కోట్లు పారితోషకం కింద అందుకోబోతున్నట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.