Advertisementt

మైక్ టైసన్‌ తో లైగర్ విజయ్ దేవరకొండ

Thu 17th Jun 2021 04:23 PM
vijay devarakonda liger movie vijay devarakonda rowdy star vijay devarakonda liger pan india movie puri jagannadh,boxing legend mike tyson  మైక్ టైసన్‌ తో లైగర్ విజయ్ దేవరకొండ
Boxing Champion power in Liger మైక్ టైసన్‌ తో లైగర్ విజయ్ దేవరకొండ
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ముంబైలో ప్లాన్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ షెడ్యూల్ మొదలైతే ముంబై ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. కరణ్ జోహార్ అండ్ టీమ్ తో కోలబ్రెట్ అయిన పూరి అండ్ విజయ్ లు ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ పై బాలీవుడ్ లోనూ భీభత్సమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన లైగర్ సాలా కా బ్రీడ్ ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విదేశీ ఫైటర్స్ ని పూరి తీసుకువచ్చారు.

అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రపంచ మాజీ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను కూడా తీసుకు రాబోతున్నారట. అతని పాత్ర సినిమాలో కీలకం అని, క్లైమాక్స్ ముందు టైసన్ పాత్ర వస్తుంది అని చెబుతున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది కాబట్టి.. చాలా భాషల నటులు భాగస్వాములు అవుతున్నారట. పూరి మేకింగ్, విజయ్ దేవరకొండ స్టయిల్, అనన్య పాండే గ్లామర్ సినిమాకి ప్లస్ అవుతాయని అంటున్నారు. మరి లైగర్ షూటింగ్ ఇప్పుడు మొదలైనా సినిమా అనుకున్న టైం కి ప్రేక్షకుల ముందుకు రీచ్ అవడం కష్టమే.

Boxing Champion power in Liger:

Legend special in Liger

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ