గతంలో సంచయిత గజపతిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవల హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. హై కోర్టు తీర్పుతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మళ్లీ మాన్సాస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు మళ్ళీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్ గా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ అశోక్ గజపతి రాజుపై పలు ఆరోపణలు చేశారు.
అశోక్‌గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్‌గా ఉండగా అవినీతి చేసారని, అశోక్ గజపతిరాజు గారు మాన్సాస్ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు అంటూ సంచలనంగా మాట్లాడారు. అంతేకాకుండా 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం అని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.