ఏపీలో 10th, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది. కరోనా అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. నేడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుంటారని అన్నప్పటికీ.. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డ్ రంగం సిద్ధం చేస్తుంది అని, రోజు విడిచి రోజు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.11 పేపర్లకు బదులు 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుందని సెప్టెంబర్ 2 లోపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి.. అంటూ ప్రచారం జరుగుతుంది.
కానీ మంత్రి ఆదిమూలపు మాత్రం పరీక్షల తేదీలపై సీఎం వద్ద ఎటువంటి చర్చా జరగలేదని చెబుతున్నారు. అలాగే పరీక్షల నిర్వహణ విషయంలో సుప్రీం నోటీసులు విషయం తమ దృష్టికి రాలేదన్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు నోటీసు లు వచ్చిన తర్వాత సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని.. మొదటి నుంచి విద్యార్థుల విషయంలో తమ స్టాండ్ ఒక్కటేనని.. ఒక వేళ కోర్టు నోటీసులు వస్తే తమ స్టాండ్ వినిపిస్తామని ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు.