Advertisementt

డిజిటల్ మీడియాలోకి టాప్ యాంకర్స్

Thu 17th Jun 2021 11:48 AM
anasuya and rashmi,jabardasth anchors,anasuya bharadwaj,rashmi gautham,web-series,mallemala productions  డిజిటల్ మీడియాలోకి టాప్ యాంకర్స్
Popular Anchors in a Web-Series డిజిటల్ మీడియాలోకి టాప్ యాంకర్స్
Advertisement
Ads by CJ

వెండితెర - బుల్లితెరకు తీసిపోని విధంగా డిజిటల్ మీడియా క్రేజీగా మారింది. టాప్ హీరోయిన్స్ సైతం,డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. కాజల్, తమన్నా, రీసెంట్ గా సమంత, రాశి ఖన్నా లాంటి వాళ్ళు డిజిటల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. వెబ్ సీరీస్ లో టాక్ షోస్ అంటూ హీరోయిన్స్ సైతం డిజిటల్ మీడియాని వాడేస్తున్నారు. సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ ల తోను ఫుల్ గా సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగులో టాప్ యాంకర్స్ గా ఉన్న యాంకర్స్ ఇద్దరు కలిసి వెబ్ సీరీస్ చేయబోతున్నారట. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ అల్లడిస్తున్న అనసూయ - రష్మీ లు కవలబోతున్నారట. నువ్వా - నేనా అంటూ గ్లామర్ లోను, యాంకరింగ్ లోను పోటీపడే వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నారట.

ఈ వెబ్ సీరీస్ లో అనసూయ అండ్ రష్మి పాత్రలే కీలకంగా ఉండబోతున్నాయి అని ఇప్పటి వరకు బుల్లితెరపై స్పెషల్ షోస్ తో అదరగొడుతున్న మల్లెమాల ప్రొడ్యూసర్స్ ఈ వెబ్ సిరీస్‌తోనే ఓటిటి రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు అని అంటున్నారు. అడుగుపెట్టడమే.. వరసగా వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేయాలని చూస్తున్నారు వాళ్లు. ముందుగా జబర్దస్త్ యాంకర్స్ అనసూయ - రష్మీ ల కోసం కథ కూడా ఫైనల్ అయిందని తెలుస్తుంది. వచ్చేనెల అంటే జులై నుంచి ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. స్టేజ్ మీద గ్లామర్ తో రచ్చ చేసే జబర్దస్త్ బ్యూటీస్ ఇద్దరూ ఒకే వెబ్ సిరీస్‌లో కనిపిస్తే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Popular Anchors in a Web-Series:

Anasuya and Rashmi in a web-series

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ