కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో ఎపుడు ఎలాంటి ఫోన్ వస్తుందో.. తమకి ఆప్తులైన వారిని ఎవరిని కోల్పోయామో అనే టెంక్షన్ తోనే ఫోన్ అటెంప్ట్ చేస్తున్నవారు.. పడే వేదన ఆవేదన వర్ణించడం చాలా కష్టం. కొవిడ్ 19 ట్ ఆప్తులని, కన్నవారిని, కట్టుకున్నవాడిని, అన్నదమ్ములని, భర్త భార్యని, భార్య భర్తని కోల్పోయిన వారు.. కుటుంబాలకు కుటుంబాలే కోవిడ్ వల్ల సర్వనాశనం అయినవారు ఉన్నారు. కొరోనా మహమ్మారి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. అయితే ఈటీవీలో గురు, శుక్ర వారాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న జబర్దస్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో కామెడీ చేసే కమెడియన్స్ చాలామంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అయితే తాజాగా ఓ జబర్దస్త్ టీం లీడర్ కొన్నాళ్లుగా జబర్దస్ షోలో కనిపించడం లేదు. అంటే ఈమధ్యన కొన్ని స్కిట్స్ ని తగ్గించేసారు? లేదంటే వేరే కారణాల వలన దూరంగా ఉన్నారో? అనుకుంటున్నారు.
అతనెవరో కాదు జిగేల్ జీవన్. గత నెలరోజులుగా అంటే నాలుగు స్కిట్స్ నుండి కనిపించడం లేదు. కారణం ప్రాణాపాయ స్థితిలో ఐసియులో ఉన్నాడని అదిరే అభి, ఆటో రామ్ ప్రసాద్ లు అలీ తో సరదాగా షో లో చెప్పి కామెడీ ప్రియులకి షాకిచ్చారు. జబర్దస్త్ టీం సభ్యులలో అదిరే అభి అందరిని కలుపుకుపోతూ అందరిని దగ్గరుండి చూసుకుంటాడని, అభి నే అన్నీ చూసుకుంటాడని.. జిగేల్ జీవన్ తీవ్ర అనారోగ్యంతో ఐసియులో ఉన్నప్పుడు డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అని చెప్పినప్పుడు కూడా అభినే దగ్గరుండి చూసుకున్నాడని, డాక్టర్స్ తో మాట్లాడ్డం, జీవన్ పేరెంట్స్ తో మట్లాడడం అన్ని అభి నే చూసుకునేవాడని చెప్పాడు.
జీవన్ బ్రతకడం కష్టమని, చాలా డేంజర్ సిట్యువేషన్ లో జీవన్ ఉన్నాడని అప్పుడు అంతా అభినే చూసుకున్నాడని చెప్పిన రామ్ ప్రసాద్ జీవన్ ఎలాంటి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాడో? ఇప్పుడు ఎలా ఉన్నాడో మాత్రం చెప్పలేదు. జిగేల్ జీవన్ కి అంత జబ్బు చేసిందా? అసలు జీవన్ కి ఏమైంది అంటూ కామెడీ ప్రియులు షాకవుతున్నారు.