థియేటర్స్ లో బొమ్మ లేదు, ఓటిటిలో కొత్త సినిమాల జాడ లేదు. బుల్లితెర మీద సందడి లేదు, ప్రతి ఆదివారం కొత్త సినిమాల హడావుడితో బుల్లితెర సందడిగా కనిపించేది. కానీ ఆదివారం వచ్చింది అంటే బోర్ బోర్ అంటున్నారు. వేసిన సినిమాలే వేసి మరీ ఎంటరైన్మెంట్ ఛానల్స్ బోర్ కొట్టిస్తున్నాయి. ఈ ఏడాది థియేటర్స్ ఓపెన్ అయ్యి.. విడుదలైన సినిమాలన్ని నెల తిరక్కుండానే ఓటిటిలో వచ్చేసాయి. ఇక లాక్ డౌన్ పెట్టి థియేటర్స్ బంద్ అయినా.. ఏ ఒక్కరూ ఓటిటి వైపు చూడలేదు. దానితో కొత్త సినిమాల సందడి లేదు. ఇక వచ్చే ఆదివారం మాత్రం బుల్లితెర మీద కొత్త సినిమాల సందడి మొదలు కాబోతుంది.
అది నితిన్ - కీర్తి సురేష్ కాంబోలో తెరకెక్కిన రంగ్ దే మూవీ మార్చ్ లో థియేటర్స్ లో విడుదలైంది. ఆ సినిమా రీసెంట్ గా జీ 5 ఓటిటి లోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే మూవీ బుల్లితెర మీద జీ తెలుగులో ఈ ఆదివారం సాయంత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతుంది. మరొకటి కార్తికేయ - లావణ్య త్రిపాఠి కాంబోలో తెరకెక్కిన చావుకబురు చల్లగా మూవీ థియేటర్స్ లో విడుదలైంది.. ఆ సినిమాకి సో సో టాకే వచ్చినా.. ఓటిటిలో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే మూవీ స్టార్ మా ఆదివారం సాయంత్రం ప్రసారం కాబోతుంది. ఇక జెమిని టివిలో అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో సినిమా వేస్తున్నారు. సో ఈ ఆదివారం బోర్ లేకుండా కొత్త సినిమాల జోరు ఉండబోతుంది. గెట్ రెడీ బుల్లితెర ప్రేక్షకులూ.. ఎంజాయ్ చెయ్యండి.