గత ఏడాది మార్చ్ 20 నుండి డిసెంబర్ వరకు కరోనా క్రైసిస్ తో సినిమా హాళ్ళన్నీ మూసి వెయ్యాల్సి వచ్చింది. కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్, సినిమా షూటింగ్స్ ఒకటేమిటి జనజీవనమే స్తంభించింది. ఇక ఈ ఏడాది సంక్రాతి టైంకి థియేటర్స్ కి పూర్వ వైభవం వచ్చినా.. మరోసారి కరోనా సెకండ్ వేవ్ థియేటర్స్ మీద పడింది. ఏప్రిల్ 15 నుండి 20 వరకు 50 పర్సెంట్ అక్యుపెన్సీతో నడిచిన థియేటర్స్ ఆ తర్వాత కర్ఫ్యూలు, లాక్ డౌన్ తో పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఓ కొలిక్కి రావడంతో లాక్ డౌన్ నుండి అన్ లాక్ లోకి వచ్చేస్తున్నాయి రాష్ట్రాలు. దానితో పార్క్ లు జిమ్ లు లాంటి ప్రదేశాలు ఓపెన్ చేసేసారు. ఇక జులై 1st నుండి థియేటర్స్ కూడా ఓపెన్ చెయ్యబోతున్నారు. తెలంగాణాలో నాలుగో విడత లాక్ డౌన్ జూన్ 20 తో ముగియబోతుంది.
ఆ తగర్వాత నైట్ కర్ఫ్యూలని అమలు చేసి.. జులై ఫస్ట్ నుండి పూర్తి అన్ లాక్ ప్రక్రియలో భాగంగా థియేటర్స్ ని ఓపెన్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అది కూడా 50 శాతం అక్యుపెన్సీతో థియేటర్స్ ని ఓపెన్ చెయ్యడానికి అనుమతులు లభించనున్నాయి. గత రెండు నెలలుగా థియేటర్స్ కి వెళ్లలేక ఓటీటీల్లో సినిమాలు లేక ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతున్నారు. ఇప్పుడు 50 పర్సెంట్ అక్యుపెన్సీతో మొదలు కాబోయే థియేటర్స్.. కరోనా పూర్తిగా తగ్గితే 100 పర్సెంట్ అక్యుపెన్సీకి పెరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాల షూటింగ్ పూర్తి చేసుకుని కూర్చున్నారు. వారంతా థియేటర్స్ ఓపెన్ కాగానే సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు.